మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన చికెన్ ధరలు ఇవాళ అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.200లకు పైనే ఉంది. తెలంగాణలో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.213 ఉండగా.. ఏపీలో రూ.207 ఉంది. స్కిన్ లెస్ చికెన్ తెలంగాణలో కేజీ ధర రూ.243కు పెరగ్గా.. ఏపీలో 236కు చేరింది.