వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్ కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్లు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్ ఫామ్ అయిన న్యూ ప్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు.