ప్రముఖ గాయని పీ సుశీలకు ‘కలైజ్ఞర్ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్’ అవార్డును తమిళనాడు సర్కార్ ప్రకటించింది. దివంగత DMK అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు సర్కార్ తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్ నినైవు కళై తురై విత్తగర్ అవార్డును ప్రదానం చేయడానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్ ఆరూర్దాస్కు దక్కింది. ఈనెల 30న సీఎం స్టాలిన్ చేతులమీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు.