సంచార జాతులకు చెందిన విద్యార్థులకు నూరు శాతం ఆర్థిక సహాయానికి కేంద్రప్రభుత్వం పీఎం యశస్వి పథకం కింద ప్రత్యేక స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, ఎన్ఐటీలు తదితర ప్రీమియర్ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు 2024-25 ఏడాదికి 304 విద్యా సంస్థల్లో ఉపకారవేతనాల స్లాట్లను కేంద్ర సామాజిక న్యాయశాఖ ప్రకటించింది.