దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను తగ్గించటం కోసం ప్రభుత్వం వద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల ఉల్లిపాయలను ప్రధాన నగరాల్లో హోల్సేల్ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సబ్బిడీ ద్వారా కేజీ ఉల్లిని రూ.35కు అమ్మాలని భావిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని ఎత్తి వేయడంతోనే ధరలు కొడ్డెక్కాయి.