పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదానికి సంబంధించి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో దాదాపు 25 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. పాక్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న కుర్రం జిల్లాలో ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఘర్షణలను నివారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.