TG: ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌లో తరలిస్తున్న 9 క్వింటాళ్ల గంజాయి సీజ్ చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తలమడుగు మండలం లక్ష్మీపూర్‌లో ఘటన జరిగింది.