PLD: పిడుగురాళ్లలోని ఆంధ్ర బ్యాంకు సెంటర్లో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సోడాలు వ్యాపారి ఏవూరి సత్యనారాయణ వ్యాపారాన్ని పూర్తిచేసుకుని ఇంటికి వెళుతున్నాడు. రోడ్డు దాటే సమయంలో అటుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి ఎస్ఐ మోహన్రావు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.