»Ys Sharmila And Tammineni Veerabhadram Interesting Discussion
Interesting:షర్మిల-తమ్మినేని వీరభద్రం మధ్య ఆసక్తికర చర్చ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీజేపీకి బీ టీమ్‌లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో వీరభద్రం అనగా.. అదేం లేదని ఆమె చెప్పారు.
YS Sharmila and tammineni veerabhadram Interesting discussion
YS Sharmila:టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.. విద్యార్థుల కోసం పోరాడుదాం అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అంటున్నారు. ఈ రోజు ఆమె విపక్ష పార్టీ నేతలను కలుస్తున్నారు. తొలుత తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ను (Kodandaram) కలిశారు. ఆయనే టీ-సేవ్ చైర్మన్ పదవీ చేపట్టాలని నిన్న ప్రతిపాదించారు. తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో (tammineni veerabhadram) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
వాస్తవానికి షర్మిల వచ్చి.. వీరభద్రాన్ని కలిసింది టీ-సేవ్ గురించి. అయితే ఆయన మాత్రం బీజేపీకి బీ టీమ్‌లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో (sharmila) అన్నారట. అలా అనగానే అదేం లేదు.. బీజేపీ చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతున్నామని పేర్కొన్నారు. ఆ పార్టీని మతతత్వ పార్టీ అని బహిరంగంగా కామెంట్ చేసేది తామేనని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీకి (brs) వామపక్షాలు బీ టీమ్‌గా పనిచేశాయని షర్మిల అన్నారు. తమ పార్టీ ఏ రోజు.. మరో పార్టీ కోసం పనిచేయలేదని స్పష్టంచేశారు. టీ-సేవ్‌లో (T-SAVE) బీజేపీ ఉంటే.. తాము కలిసి రాబోమని తమ్మినేని వీరభద్రం తేల్చిచెప్పారు. ఈ అంశాన్ని తాము గౌరవిస్తున్నామని షర్మిల (Sharmila) తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ కలిసి పనిచేయాలని కోరారు. ఆ తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో (kunamneni sambashiva rao) భేటీ అయ్యారు. టీ-సేవ్‌కు మద్దతు తెలుపాలని కోరతారు.