»They Have Dont Work Bandi Sanjay Reacts About Modi Education
Positionsకు చదువుతో సంబంధం లేదు.. మోడీ ఎడ్యుకేషన్‌పై బండి సంజయ్
పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.
They have don't work bandi sanjay reacts about modi education
Bandi sanjay:ప్రధాని మోడీ చదువుపై ఇటీవల చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. విపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఈ రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) స్పందించారు. పదవులకు, చదువుకు సంబంధం లేదని స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ (modi) చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి (modi) పేరుందని గుర్తుచేశారు. ఈ నెల 8వ తేదీన మోడీ (modi) సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో సభ ఉంది. సభ స్థలిని బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ (kcr) గురించి బండి సంజయ్ (sanjay) మాట్లాడారు. ప్రతిపక్షాలకు డబ్బులు పెట్టే స్థాయికి కేసీఆర్ (kcr) ఎలా ఎదిగాడో చెప్పాలని కోరారు. నందినగర్‌లో (nandinagar) గల ఇంట్లో ఉన్న సమయంలో బ్యాంక్ లోన్లు (bank loan) కట్టలేని స్థితిలో ఉండేవారని గుర్తుచేశారు. ఇప్పుడు వేల కోట్లు ఎక్కడివి అని అడిగారు. హైదరాబాద్‌లో (hyderabad) లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ (bandi sanjay) తెలిపారు. పదో తరగతి కొశ్చన్ పేపర్స్ లీక్ ఇష్యూ గురించి స్పందించారు. తెలుగు (telugu), హిందీ (hindi) వరసగా పేపర్లు ఎలా లీక్ అవుతున్నాయని అడిగారు.
కేసీఆర్ (kcr) అపారజ్ఞాని ఆట.. 80 వేల పుస్తకాలు చదివి ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు కేటీఆర్ (ktr), కూతురు కవిత (kavitha) చదివన చదువులు లిక్కర్ దంగా, డ్రగ్స్ దందా చేయమని చెప్పినట్టు ఉందన్నారు. బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల పార్టీ అని విమర్శించారు. ఇదివరకు కవిత అపార్ట్మెంట్లో ఉండేదని.. కేటీఆర్‌కు ఇల్లు లేదని.. ఇప్పుడు వేల కోట్లు ఎక్కడివి అని అడిగారు.