»Ys Avinash Reddy Attend Second Time Cbi Interrogation On Ys Viveka Case
YS Viveka Case రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
సీబీఐ కేసును తీవ్రంగా పరిగణించడంతో పాటు చాలా మందిని విచారణ చేసింది. ఆ విచారణలో వచ్చిన వివరాలకు అవినాశ్ తో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విచారణ అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీబీఐ దూకుడుగా వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) రెండోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. గతంలో ఒకసారి విచారణ (Interrogation) చేసిన సీబీఐ (CBI) మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో శుక్రవారం హైదరాబాద్ (Hyderabad)లోని సీబీఐ కార్యాలయానికి అవినాశ్ రెడ్డి వచ్చారు. కోఠి (Koti)లోని కార్యాలయంలో సీబీఐ బృందం ఎదుట విచారణకు వెళ్లారు.
జనవరి 28వ తేదీన దాదాపు ఐదు గంటల పాటు సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. నాడు విచారణకు నానా హంగామా చేసిన వైఎస్సార్ సీపీ నేటి విచారణకు మాత్రం ఎలాంటి హడావుడి లేదు. ఆనాడే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని అవినాశ్ తెలిపారు. గతంలో అడిగిన వివరాలకు కొనసాగింపుగా తాజాగా మళ్లీ అధికారులు అవినాశ్ నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ముఖ్యంగా హత్య జరిగిన రోజు ఫోన్ కాల్స్ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. సీఎం జగన్ సన్నిహితుడిని, మరికొందరిని విచారించిన విషయం తెలిసిందే. ఆ విచారణ సమయంలో అవినాశ్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ విషయమై కూడా అవినాశ్ ను అధికారులు అడుగుతున్నట్లు సమాచారం.
విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈసారి విచారణ చాలా సేపు పట్టే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ కేసును తీవ్రంగా పరిగణించడంతో పాటు చాలా మందిని విచారణ చేసింది. ఆ విచారణలో వచ్చిన వివరాలకు అవినాశ్ తో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విచారణ అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీబీఐ దూకుడుగా వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది.