»You Know The Price Of The Most Expensive Sushi In The World Japan Osaka
Expensive sushi: ప్రపంచంలోనే ఖరీదైన వంటకం..మీరు కూడా ట్రై చేస్తారా?
మీరెప్పుడైనా ప్రపంచం(world)లోనే అత్యంత ఖరీదైన వంటకాన్ని చుశారా? లేదా అయితే ఇక్కడ చుద్దాం. తాజాగా జపాన్ ఒసాకాలోని ఓ రెస్టారెంట్ సరికొత్త వంటకాన్ని తయారు చేసింది. అయితే దీనిలో 20 రకాల వెరైటీలను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే దీని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
you know the price of the most expensive sushi in the world japan osaka
జపాన్(japan) ఒసాకాలోని ఓ రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుషీని(వంటకం)(sushi) తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దీనిని తినాలంటే దాదాపు 2,00,000 రూపాయలు చెల్లించాల్సిందే. అయితే దీని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత రేటు అనే వివరాలను ఇప్పుడు చుద్దాం. 20 రకాల(20 pieces) పదార్థాలతో కూడిన ‘కివామీ ఒమాకేస్’ అనే ప్రత్యేక వంటకాన్ని ఈ రెస్టారెంటులో రూపొందించారు. అయితే ఈ సుషీని వారు ఇతర దేశాల నుంచి ఎంచుకున్న ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి తయారు చేసినట్లు వెల్లడించారు. జపాన్ నలుమూలల నుంచి సేకరించిన చేపలు, చైనా నుంచి మట్సుటేక్ పుట్టగొడుగులు, ఇటలీ నుంచి బ్లాక్ ట్రఫుల్స్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం నుంచి తిమింగలం మాంసం సహా నిగిరి, సాషిమి అనే పలు రకాల పదార్థాలను దీనిలో ఉపయోగించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు ప్రపంచం(world)లోనే అత్యంత ఖరీదైన సుషీ రికార్డు గతంలో చెఫ్ ఏంజెలిటో అరనెటా జూనియర్ పేరిట ఉండేది. దాని ఖరీదు సుమారు లక్ష రూపాయలు. ఆ వంటకంలో ఐదు వజ్రాలు పొదిగిన నిగిరి ముక్కల ఆకులు, క్యారెట్ బంగారు ఆకు వంటి వాటని ఉపయోగించారు. అయితే ఈ కొత్త రికార్డు వంటకం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు కూడా ఈ సుషీ కోసం రూ.2,00,000 చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.