ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా ‘రైటర్ పద్మభూషణ్’ మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన బుధవారం తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. సెలక్టెడ్ థియేటర్స్ లలో ఈ సినిమాను మహిళలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. యువ దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పారాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమా చూసి చిత్రబృందాన్ని అభినందించారు. స్వయంగా చిత్రబృందాన్ని కలిసి మెచ్చుకున్నారు. ట్విటర్ ద్వారా సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రేక్షకులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 స్పెషల్ షోస్ ను ప్రదర్శించనున్నారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ బ్యానర్ పై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా రూ.3.6 కోట్లు వసూలు చేసిందని సమాచారం. కలర్ ఫొటో తర్వాత సుహాస్ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నాడు. విజయవాడలోని ఓ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రైరియన్ పద్మభూషణ్ పాత్రలో సుహాస్ మెరిశాడు. రైటర్ అనిపించుకునేందుకు పడే అవస్థల ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కింది.