World Hypertension Day : హైబీపీని కంట్రోల్ చేయడానికి ఇవే మార్గాలు
హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది మందుల్లోనో లేక వైద్యంలోనో లేదనే నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని అంటున్నారు. మనిషి అధిక ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతమైన జీవితానికి అలవాటుపడ్డప్పుడు ఆరోగ్యం కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు.
అకాల మరణాలకు, పక్షవాతానికి హైబీపీ ఒక కారణం అని తెలుస్తోంది. రక్తప్రసరణ ఎక్కువగా అవడంవలన బీపీ ఎక్కువ అవుతుంది. దీనికి జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ సమస్యలు హైబీపీ వలనే సంభవిస్తాయి. ప్రతీ ఏడాది మే 17వ తేదీన వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా నిర్వహిస్తారు. భారత్ లో 220మిలియన్ల కంటే ఎక్కువ మంది హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు రక్తపోటుతో పాటు చికిత్సలపై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మందులు అవసరం లేకున్నా ఆహారం, వ్యాయామం, మెడిటేషన్ ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.
హైబీపీ రావడానికి ముఖ్యంగా ఆహారనీయమాలు పాటించకపోవడం చెడు వ్యసనాలకు బానిసగా మారడంతో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. వయసు పైబడి తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ విషయానికి తీవ్ర ఒత్తిడికి గురవడం, విపరీతమైన స్మోకింగ్ చేయడం, లిక్కర్ సేవించడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం లాంటి వాటితో బీపీ ఎక్కువ అవుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా అవసరమైనంత శారీరక వ్యాయామం చేయాలంటున్నారు. 30 సంవత్సరాలు దాటి ఆరెగ్యంలో తేడా వచ్చినట్లు అనిపించిన వారందరూ ప్రతీ సంవత్సరం రక్తపోటును చెక్ చేసుకోవడం అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
హైబీపీ రావడానికి వారసత్వకారణాలు కూడా కారణమని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆహారం తినకుండా ఒత్తిడి గురయ్యే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారము వ్యాయామము ద్వారా అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఏడాది మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డేను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.