Health Tips: చద్దన్నం తింటున్నారా? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలివే
చాలా మందికి చద్దన్నం(Leftover Rice) అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ చద్దన్నం తింటే అనేక ప్రయోజనాలు(Benefits) కలుగుతాయని చాలా మందికి తెలియదు. రాత్రి మిగిలిన అన్నాన్ని(Leftover Rice) పొద్దున్నే తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
చాలా మందికి చద్దన్నం(Leftover Rice) అంటే అస్సలు ఇష్టం ఉండదు. చద్దన్నం అంటే ఇష్టపడనివారే చాలా మంది ఉంటారు. కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాంతి చేసుకుంటారు. కానీ చద్దన్నం తింటే అనేక ప్రయోజనాలు(Benefits) కలుగుతాయని చాలా మందికి తెలియదు. రాత్రి మిగిలిన అన్నాన్ని(Leftover Rice) పొద్దున్నే తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చద్దన్నం వల్ల అనేక రకాల లాభాలున్నాయి. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి ఎక్కువవుతుంది. రాత్రి వండిన అన్నం(Leftover Rice)లో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే ఉదయం అయ్యే సరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. అందుకే చద్దన్నం తింటే మనకు బీ6, బీ12 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్గా మారుతుంది.
చద్దన్నంలో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభించడమే కాకుండా ఒంట్లో వేడిని సైతం అది తొలగిస్తుంది. తరచూ చద్దన్నం తింటే పీచుదనం పెరిగి మలబద్దకం, నీరసం లాంటి సమస్యలు పూర్తిగా నయం అవుతాయి. అదేవిధంగా బీపీ(Blood Plessure)ని చద్దన్నం అదుపులో ఉంచుతుంది.
చద్దన్నం ప్రతి రోజూతినేవారిలో ఆందోళన అనేది తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు చద్దన్నం తింటే తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల(Ulcer) వంటివి ఉంటే చద్దన్నం తినడం మంచిది. చద్దన్నం వల్ల అల్సర్(Ulcer) తగ్గిపోతుంది. ఎదిగే పిల్లలకు కూడా చద్దన్నం పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది.
ప్రతి రోజూ చద్దన్నం తింటే లావుగా ఉన్నవారు సన్నబడే అవకాశం ఉంది. స్థూలకాయ సమస్యను చద్దన్నం తగ్గిస్తుంది. రాత్రి మిగిలిన అన్నంలో పాలు(Milk)పోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేసరికే తోడన్నం అదిరిపోయే రుచిని ఇస్తుంది. నిత్యం ఈ తోడన్నం తినడం వల్ల సన్నగా ఉన్నవాళ్లు క్రమంగా ఒళ్లు చేస్తారు. అలా సన్నగా ఉన్నవారు క్రమంగా తింటూ ఉంటే లావు అవుతారు.
పాల(Milk)తో తోడేసిన అన్నాన్ని గానీ, చల్లలో నానబెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తినబుద్దికాకపోతే వాటికి ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుపుకోని తినాలి. కొందరైతే తాళింపు పెట్టుకుని కూడా లాగిస్తుంటారు. చద్దన్నాన్ని కచ్చితంగా ఉదయాన్నే తినాలి. రాత్రి మిగిలిన అన్నం(Leftover Rice) ఉదయానికి తినాలి. అలా కాకుండా మరింత ఆలస్యం చేస్తే అది ఎక్కువగా పులిసి అనారోగ్యపాలు(Health Problems) చేసే ప్రమాదం ఉంది.