మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
We will give death sentence to the accused of Manipur incident
Manipur: మణిపూర్(Manipur) లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా(Naked Women Parade) ఊరేగించిన నిందితుడికి మరణశిక్ష(Death penalty) విధిస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్(CM Biren Singh) తెలిపారు. వైరల్ అవుతున్న ఈ వీడియో(Viral Video)పై సీఎం తన ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఈ ఘటన దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా రెండు తెగల(కుకీ, మైటేయి) మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలు చాలా హింసత్మకంగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితం ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరెగించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతుంది. ఆ మహిళల్ని నగ్నంగా పరేడ్(Parade women naked) చేయించిన తౌబాల్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల హీరాదాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మణిపూర్‌లోని కంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నిన్న బుధవారం ఈ వీడియో మరోసారి వైరల్ కావడంతో దీనిపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్(CM Biren Singh) స్పందించారు. నిందితులకు మరణదండన పడుతుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, మర్డర్ కింద కేసు బుక్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు 12 బృందాలుగా అన్వేషించారని పేర్కొన్నారు. మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేపట్టామని, ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయం స్థానం ముందు నిలబెడుతామని సీఎం బీరేన్ సింగ్ ఇలాంటి ఘటనలకు సమాజంలో చోటులేదన్నారు.
My hearts go out to the two women who were subjected to a deeply disrespectful and inhumane act, as shown in the distressing video that surfaced yesterday. After taking a Suo-moto cognisance of the incident immediately after the video surfaced, the Manipur Police swung to action…