»Virat Kohli As Rcb Captain Win The Match Against Pbks
Virat Kohli: RCB కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. మ్యాచ్ గెలిచెనా?
పంజాబ్ కింగ్స్‌తో ఈరోజు(ఏప్రిల్ 20)న జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) తిరిగి RCBకి కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే డు ప్లెసిస్ గాయం కారణంగా విరాట్ బాధ్యతలు స్వీకరించారు.
నేడు(ఏప్రిల్ 20న) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపిఎల్ 2023 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli)RCBకి కెప్టెన్సీగా తిరిగి ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కోహ్లి RCB కెప్టెన్సీని వదులుకున్నాడు. డు ప్లెసిస్ గాయం కారణంగా ఈ మ్యాచుకు కెప్టెన్సీగా విరాట్ ని ఎంపిక చేశారు. మరోవైపు డు ప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడని కోహ్లీ వెల్లడించాడు. ఇంకోవైపు ధావన్ గాయం కారణంగా పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా సామ్ కరన్ ఉన్నారు. టాస్ గెల్చిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
టాటా ఐపీఎల్ ఈ సీజన్‌లోని ఇరవై ఏడవ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో తలపడతుంది. ఈ ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌లు ఆడగా..మూడు మ్యాచ్‌లు గెలిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడి..మూడు మ్యాచ్‌లు విన్ అయ్యారు.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి 30 మ్యాచ్‌లు ఆడగా, పంజాబ్ కింగ్స్(PBKS) 17 మ్యాచ్‌లు గెలుపొందగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌లు గెలుపొందింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ ఓ జట్టు గెలుస్తుందో చూడాలి. ఓ జట్టు గెలుస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.