సికింద్రాబాద్ కళాసిగూడలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఉదయం పాల ప్యాకెట్ కొనేందుకు కిరణా దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మౌనిక ప్రమాదవశాత్తు నాలాలో పడి మృత్యువాత చెందింది. అయితే వర్షం కారణంగా నాలా పై భాగానికి రంధ్రం పడటం వల్ల..ఆ విషయం తెలియని చిన్నారి నాలా పై నుంచి నడిచి అందులో పడిపోయింది.
ఆ తర్వాత గమనించిన గమనించిన స్థానికులు చూసి పోలీసులకు విషయం తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నాలా నుంచి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తర్వాత మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చిన్నారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
మరోవైపు GHMC అధికారుల నిర్లక్షమే చిన్నారి మృతికి కారణమని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండటం వల్లే చిన్నారి మరణించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు చిన్నారి కుటుంబానికి సాయం చేయాలని కోరుతున్నారు.