»Today India Vs Australia Wtc Final 2023 Match Live Here What Is The Prize
WTC final 2023: నేడే ఇండియా Vs ఆస్ట్రేలియా WTC మ్యాచ్..ఇక్కడే లైవ్, ప్రైజ్ ఎంతంటే
టీమిండియా Vs ఆస్ట్రేలియా WTC ఫైనల్ 2023 మ్యాచ్ నేడు మొదలు కానుంది. ఇరు జట్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నేడు తొలిరోజు ఎవరు రాణిస్తారో చూడాలి.
ఈరోజు(జూన్ 7) నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023కు సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టెందుకు ఇండియా టీం సిద్ధమైంది. ఈ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో ఎడిషన్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది. MS ధోని నేతృత్వంలో చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత వారి మొదటి ICC ట్రోఫీని గెల్చుకునేందుకు పోటీపడుతోంది.
మరోవైపు ఆస్ట్రేలియా టీం మొదటిసారిగా WTC ఫైనల్‌ను ఆడుతోంది. గతంలో ODI ప్రపంచ కప్, T20 వరల్డ్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న ఈ జట్టు ఈ WTC టైటిల్‌ను గెల్చుకోవాలని ఆశిస్తోంది. ఇంకోవైపు భారత్ వరుసగా రెండో WTC ఫైనల్‌ను ఆడుతోంది. అయితే లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోయిన చివరిసారి కంటే ఈసారి భిన్నమైన ఫలితం కోసం టీంఇండియా చూస్తోంది.
ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా అజింక్యా రహానే, సౌరవ్ గంగూలీల రికార్డును అధిగమించేందుకు రోహిత్ శర్మ ప్రస్తుతం బరిలో ఉన్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ చేతిలో పరాజయం పాలైనందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాట్ కమ్మిన్స్ సైతం ఆసీస్ జట్టు నుంచి పోటీగా ఎదురుచూస్తున్నారు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023 విజేతలకు 1.6 మిలియన్ల యూఎస్ డాలర్లు(రూ.13.23 కోట్లు) అందజేస్తారు. ఇక రన్నర్ జట్టుకు 800,000 డాలర్లు (రూ.6.61 కోట్లు) ఇవ్వనున్నారు.
ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా WTC ఫైనల్ మ్యాచ్‌ను టీవీలలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడుతుంది. ఇక ఫోన్లలో అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఇండియా చివరిగా 2013లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి జట్టు మూడు ఫైనల్స్‌లో ఓడిపోయింది. నాలుగు సందర్భాలలో సెమీఫైనల్ దశలో దుమ్ము రేపింది. 2021 టీ20 ప్రపంచకప్‌లో ప్రాథమిక దశలోనే నిష్క్రమించింది.