జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్న ఓం రౌత్ 'ఆదిపురుష్(Adipurush)' ట్రైలర్ మంగళవారం సాయంత్రం తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్లో లాంచ్ చేయబడింది. ఈ చిత్రంలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్(Adipurush)`. ఇండియన్ సినిమా కీర్తి ప్రతిష్టలని `బాహుబలి` సిరీస్‌తో విశ్వవ్యాప్తం చేసిన ప్రభాస్ నుంచి వస్తున్న భారీ సినిమా కావడంతో దేశం మొత్తం ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. టి సిరీస్ వారు అత్యంత భారీ స్థాయిలో దృశ్యకావ్యంగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. 3డీ ఫార్మాట్లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో యువీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నఈ దృశ్యకావ్యాన్నిజూన్ 16న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ముందు ఐదు భాషల్లో అనుకున్న ఈ సినిమాని మొత్తం పది భాషల్లో రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ చారిత్రాత్మక చిత్రం మరో పదిరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మంగళవారం ఆధ్యాత్మిక ప్రదేశమైన తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చినజియర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో జరిగింది.
కాగా, ఈ సందర్భంగా ప్రభాస్(prabhas) మాట్లాడుతూ తన పెళ్లి టాపిక్ గురించి కూడా స్పందిండం గమనార్హం. ‘3డీలో నా ఫ్యాన్స్ కోసం ఒకసారి ప్రత్యేకంగా చూపించండి అని దర్శకుడు ఓం రౌత్‌ని అడిగాను. ఇక సారి వాళ్ల స్పందన ఎలా ఉంటుందో చూడండి అని చెప్పాను. ఫస్ట్ టైమ్ 3డీలో మీరు చూశారు. ట్రైలర్ చూసి మీరిచ్చిన ధైర్యమే ఇంత వరకు మా టీమ్‌ను నడిపించింది. మీరిచ్చిన ప్రోత్సాహమే ఇదంతా. ఓం ఏమన్నాడంటే ఫ్యాన్స్ కే ముందు 3డీ ట్రైలర్ నేను చూపిస్తాను అన్నాడు. వాళ్లే చూడాలి. మమ్మల్ని ప్రోత్సహించింది వాళ్లే. మీరిచ్చిన ప్రోత్సాహంతో టీమ్ ఒక యుద్ధం చేశారు. రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రౌత్ అంతా కలిసి ఈ సినిమా కోసం ఓ యుద్ధం చేశారు. ఎనిమిది నెలల పాటు నిద్రపోలేదు. కేవలం గంట రెండు గంటలు మాత్రమే పడుకున్నారు. రెండు గంటలు మాత్రమే పడుకుని ఒక్కొక్కరు టెన్ టైమ్స్ శ్రమించారు. ఫ్యామిలీని పక్కన పెట్టి ఈ సినిమా కోసమే పని చేశారు. మంచి సినిమా చూపిద్దామని ఒక యుద్దం చేశారు. అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు. ఆదిపురుష్ చేయడం మా అదృష్టం. ’
‘ఒకసారి చిరంజీవిగారు అన్నారు. `ఏంటీ రామాయణం చేస్తున్నావా? అని ..అవును సార్ అన్నాను. అది అదృష్టం. అందరికి దొరకదు. నీకు దొరికింది. ఈ సినిమా చేయాలంటే చాలా పవర్ ఉంటుంది. మొదటి నుంచి కష్టాలు ఎదురయ్యాయి. మొత్తానికి పూర్తి చేసిన ఓమ్ టీమ్ కు హ్యాట్సాఫ్. ఓం నువ్వొక రాక్ స్టార్. ఓం చేసిన ఫైట్ మామూలు ఫైట్ కాదు. ఇలాంటి దర్శకుడిగా నా 20 ఏళ్ల కెరీర్లో ఎవరినీ చూడలేదు. ఏడు నెలల నుంచి తను నిద్రపోలేదు(no sleeping). టీమ్ మొత్తం సినిమా కోసం చేసిన యుద్ధానికి హ్యాట్సాఫ్` అన్నారు.
మధ్యలో ఫ్యాన్స్ పెళ్లెప్పుడని ప్రశ్నిస్తే .. `తిరుపతి(tirupati)లోనే చేసుకుంటానని, అయితే అది ఎప్పుడైనా జరగొచ్చన్నారు. ఇక చినజీయర్ స్వామి వారు ఈ కార్యక్రమానికి రావడం వల్ల చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సినిమాను భూషన్ చాలా ఎమోషనల్ గా తీసుకున్నాడు. దీన్ని వాళ్లు ఫాదర్ ఎమోషన్ గా భావించారు. లక్ష్మణ్ చాలా ముఖ్యమైన పాత్ర. సన్నీ సింగ్ లేకపోతే రామాయణం లేదు. జానకి పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి మంచి హీరోయిన్ అయితే బాగుంటుందని కృతిని ఎంపిక చేశారు. ఫస్ట్ స్టిల్‌లో తను చూపించిన ఎక్స్ ప్రెషనల్ అద్భుతం. మరాఠీలో పాపులర్ నటుడు దేవ్ దత్త. ఆయన హనుమంతుడిగా నటించారు. ఆయనతో కలిసి నటించడం కొత్త అనుభూతినిచ్చింది. ప్రతి సంవత్సరం రెండు సినిమాలు చేస్తాను. మూడైనా రావచ్చు. ఇంతకు మించి మాట్లాడలేను` అన్నారు.