ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిని మెగా సంస్థ రూపొందించింది. కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. త్వరలోనే ఇది ట్వీట్టర్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలువనుంది.
ట్విట్టర్(Twitter)కు పోటీగా మరో యాప్(App) వచ్చేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్‌కు పోటీగా మెగా సరికొత్తగా థ్రెడ్స్ యాప్(Threads App)ను ఆవిష్కరించింది. ఈ యాప్ ప్లేస్టోర్(playstore)లో అందుబాటులోకి వచ్చింది. యాప్ విడుదలైన రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లోనే 5 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్(Download) చేసుకున్నారు. ప్రతి గంటకూ ఈ థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్స్ పెరుగుతున్నాయి. కొద్దికాలంలోనే ఈ యాప్ ట్విట్టర్‌ను అధిగమిస్తుందని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ కంటే థ్రెడ్స్ యాప్(Threads App) పైచేయి సాధిస్తుందనే ప్రశ్నకు ఫేస్బుక్ సీఈఓ(facebook CEO) జూకర్ బర్గ్(Zuckerberg) చెప్పిన సమాధానం వైరల్(Viral) అవుతోంది. థ్రెడ్స్ యాప్ మొదటి స్థానంలో నిలవడానికి కొంత సమయం పడుతుందన్నారు. జూకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్ లాంచ్ చేసిన కొంత సేపటికే ట్విట్టర్లో ఓ కార్టూన్ విపరీతంగా వైరల్ అయ్యింది. ట్విట్టర్(Twitter) ఫీచర్స్ ఆధారంగానే థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేసినట్లు పలువురు నెటిజన్లు పేర్కొంటూ పోస్టులు చేశారు.
మెగా ఆవిష్కరించిన కొత్త యాప్‌లోని ఫీచర్లు పూర్తిగా కీబోర్డులోని కంట్రోల్, కాపీ, పేస్ట్ బటన్స్ రూపొందించబడ్డాయని పేర్కొంటూ ఓ నెటిజన్ ట్వీట్(Tweet) చేశారు. ఆ ట్వీట్‌కు ఎలాన్ మస్క్(Elon musk) నవ్వుతూ ఎమోజీతో రీ ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా మరోవైపు థ్రెడ్స్ యాప్(Threads app) తర్వలోనే అగ్రగామిగా నిలుస్తుందనే నమ్మకం తనకు ఉందని జూకర్ బర్గ్(Zuckerberg) ఆశాభావం వ్యక్తం చేశాడు.