»Telangana New Secretariat Supreme Court Ka Paul Petition Dismissed
Supreme Court కేఏ పాల్ కు భంగపాటు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు
చిత్రవిచిత్ర వేషాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ మీడియా కనిపించినా హడావుడి చేస్తున్న పాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అతడి పిచ్చి ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తోంది.
కొత్తగా నిర్మాణమవుతున్న తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అగ్ని ప్రమాదాల (Fire Accident) ఘటనలపై తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో తనకు తానే వాదనలు వినిపించుకున్న కేఏ పాల్ వింతవింతగా మాట్లాడాడు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి పిటిషన్ (Petition)లను కొట్టి పారేసింది.
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డుపై సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) ప్రతిష్టాత్మకంగా కొత్త సచివాలయం అద్భుతంగా నిర్మాణమవుతోంది. సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సీబీఐతో (CBI) విచారణ జరపాలని కోరుతూ కేఏ పాల్ పిటిషన్ వేశాడు. తాజాగా ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. తనకు తాను స్వయంగా వాదించుకున్న కేఏ పాల్ ను అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘దేశంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సీబీఐ విచారణ చేయాలి? సచివాలయం ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలైందా’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
వీటికి సమాధానం చెప్పే క్రమంలో కేఏ పాల్ విచిత్రంగా మాట్లాడాడు. ‘సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు. అది నరబలి’ అని తెలిపాడు. ‘నా జీవితానికి ముప్పు ఉంది’ అని తెలపడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకదానికి మరొక అంశం ముడిపెట్టొద్దు అని పేర్కొంది. ఈ సందర్భంగా పాల్ వేసిన పిటిషన్లు కొట్టిపారేసింది. ఇలా పాల్ చిత్రవిచిత్ర వేషాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ మీడియా కనిపించినా హడావుడి చేస్తున్న పాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అతడి పిచ్చి ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తోంది.