»Telangana Minister Harish Rao Helps To Singer Balagam Mogilayya
Harish Rao ‘బలగం’ మొగిలయ్యకు మంత్రి హరీశ్ రావు అండ
అంబులెన్స్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేసి మళ్లీ ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి తన ప్రతినిధుల ద్వారా మొగిలయ్య, కొమురమ్మలకు తెలిపారు. మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు స్పందనపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
తెలంగాణ (Telangana) అనుబంధాల ఇతివృత్తంలో వచ్చిన ‘బలగం’ సినిమా (Balagam Movie) తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోంది. థియేటర్లలో (Theatres) విడుదలైన ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి (OTT) కూడా విడుదలైంది. దీంతో ఇంటిల్లిపాది (Family) ఈ సినిమాను చూస్తున్నారు. బలగం సినిమా చూసేందుకు మళ్లీ పాత రోజుల మాదిరి గ్రామాల్లో ప్రత్యేక ప్రదర్శన ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో ‘తోడుగా మాతోడుండి’ (Thoduga Ma Thodundi Song) అంటూ పాడి ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించిన బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య (Pastam Mogilaiah) అనారోగ్యం బారిన పడ్డాడు. సమాచారం తెలుసుకున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (T Harish Rao) వెంటనే వైద్య సదుపాయం కల్పించారు.
బలగం సినిమా క్లైమాక్స్ (Climax)లో వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ (Komuramma) పాట పాడారు. ఆ దంపతులు సినిమాలో కుటుంబ అనుబంధంపై పడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. ఆ దంపతుల జీవితం కూడా కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. బుర్రకథలు చెబుతూ జీవనం పొందుతున్న మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆయన రోజు విడిచి రోజు డయాలసిస్ (Dialysis) చేయించుకోవాలి. దీనికి తోడు మధుమేహం (Sugar), బీపీ (BP) ఉంది. వీటి ప్రభావంతో అతడి చూపుపై ప్రభావం పడింది.
మొగిలయ్య ఆరోగ్యం కోసం ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చయ్యాయి. నెలకు రూ.20 వేల దాకా ఖర్చవుతోంది. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం (Helath Condition) మెరుగు కావడానికి రూ.8 లక్షలు అవసరం అవుతాయని భార్య కొమురమ్మ తెలిపింది. బలగం దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) కొంత సహాయం చేశాడు. ఆ దంపతులు దాతల సహాయం కోరుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
మొగిలయ్య ఆరోగ్యం మెరుగయ్యేందుకు వైద్య అధికారులను (Officials) ఆదేశించారు. అతడికి కావాల్సిన మందులు (Medicine) అందించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అతడి ఆరోగ్యంపై పూర్తి హెల్త్ చెకప్ (Health Checkup) చేయాలని, డయాలసిస్ సేవలు నిరంతరం అందేలా ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేసి మళ్లీ ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి తన ప్రతినిధుల ద్వారా మొగిలయ్య, కొమురమ్మలకు తెలిపారు. మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు స్పందనపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.