మా నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 80 ఏళ్లు. ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటప్పుు మా నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ కావాలని
కేటీఆర్ ప్రశ్నించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ (BRS Party Foundation Day) సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులు పండుగలా చేసుకుంటున్నారు. పార్టీగా ఆవిర్భవించి 22 ఏళ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ (TRS) బీఆర్ఎస్ గా తొలి ఆవిర్భవ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీంతో గులాబీ తమ్ముళ్లు ఫుల్ జోష్ (Full josh)లో ఉన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, కాబోయే సీఎం వంటి వాటిపై కేటీఆర్ (KTR) మాట్లాడారు.
‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటాం’ అని కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ‘విజయం సాధించడమే కాక హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ (KCR) చరిత్ర సృష్టించబోతున్నారు. దక్షిణ భారతంలోనే (South India) మూడోసారి సీఎంగా ఎన్నికై కేసీఆర్ సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తమ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది తప్పా పార్టీ డీఎన్ఏ, పార్టీ గుర్తు, తత్వం, నాయకుడు మారలేదని స్పష్టం చేశారు.
ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతారనే ప్రచారం కొనసాగుతుంది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మా నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు 80 ఏళ్లు. ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటప్పుు మా నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ (Retirement) కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ మా పార్టీకి గుర్తింపు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అరంగేట్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే సమాధానం చెబుతుంది’ అని కేటీఆర్ ప్రకటించారు.