»Big Boost To Tdp Former Apcc Chief Sake Sailajanath Likely To Joins In Tdp Shortly
త్వరలో TDPలోకి కీలక నాయకుడు.. Rayalaseemaలో మళ్లీ పూర్వ వైభవం
2024 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ మీకే అనే హామీ టీడీపీ అధిష్టానం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే భరోసారి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆ నాయకుడిని ఆహ్వానించినట్లు సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) బలోపేతమవుతోంది. అటు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమంతో జిల్లాల పర్యటనకు వెళ్తుండగా.. ఇటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పేరిట పాదయాత్రతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాడు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి (TDP) విశేష ఆదరణ పెరుగుతోంది. వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమేనని సర్వేలు వెల్లడిస్తుండడంతో టీడీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించారు. ఇక తాజాగా రాయలసీమలో మరో కీలక నాయకుడు.. మాజీ పీసీసీ అధ్యక్షుడు చేరబోతున్నాడని సమాచారం. ఈ వార్తతో ఒక్కసారిగా రాయలసీమ (Rayalaseema) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో (Anantapuram District) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీరి చేరిక భారీ లాభం చేకూరుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకీ చేరబోయే ఆ నాయకుడు ఎవరో కాదు సాకే శైలజానాథ్ (Sake Shailajanath).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కీలక నాయకుడిగా శైలజా నాథ్ వెలుగొందారు. అనంతపురం జిల్లాలోని శింగనమల (Singanamala) నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ హయాంలో విప్ గా.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో శైలజా నాథ్ మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో విభజిత ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా (PCC Chief) శైలజా నాథ్ పని చేశారు. ఇటీవల ఆ పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీలో పదవి పోవడంతో ప్రత్యామ్నాయం చూస్తున్నారు.
అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ సీపీలోకి వెళ్లితే తనకు స్వేచ్ఛ ఉండదని శైలజానాథ్ భావిస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డితో (JC Diwakar Reddy) సమావేశమయ్యారు. శైలజానాథ్ ఇంటికి వెళ్లి దివాకర్ రెడ్డి మంతనాలు చేశారు. సుదీర్ఘ కాలంలో వీరిద్దరూ అనంత రాజకీయాల్లో కొనసాగుతుండడంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ చొరవతోనే దివాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే వస్తే పార్టీలో తనకు లభించేది ఏమిటని ఆరా తీసినట్లు సమాచారం.
2024 ఎన్నికల్లో శింగనమల టికెట్ (Ticket) మీకే అనే హామీ టీడీపీ అధిష్టానం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే ఎమ్మెల్సీగా (MLC) అవకాశం ఇస్తామనే భరోసారి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా శైలజానాథ్ ను ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని పసుపు కండువా శైలాజానాథ్ కప్పుకోనున్నారు. రఘువీరా, శైలాజానాథ్ చేరికతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం రానుంది. వీరి రాకతో 2014 మాదిరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీకి మంచి స్థానాలు దక్కుతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.