»Dasara Movie On Ott Nani Keerthy Suresh Movie Dasara Streaming On Netflix
నెల కాకుండానే OTTలోకి వచ్చేసిన Dasara సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్, ధరణి పాత్రలో నానిలను చూడాలంటే పెద్ద తెర (Theatre) కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక ఘట్టమైన క్లైమాక్స్ కు మాత్రం 75 ఎంఎం కూడా సరిపోదని చెబుతున్నారు.
తెలంగాణ (Telangana) ఇతివృత్తం ఉన్న సినిమాలకు (Movies) ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫిదా (Fida) నుంచి మొదలుకుని బలగం (Balagam).. దసరా (Dasara), విరూపాక్ష (Virupaksha) వరకు అన్ని తెలంగాణ నేపథ్యంలోని సినిమాలే. ఈ సినిమాల్లో దసరా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుకుని ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలాంటి సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి (OTT) వచ్చేసింది. ఏప్రిల్ 27 గురువారం నుంచే నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది.
ధరణిగా నాని (Nani), వెన్నెల కీర్తి సురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చి 30వ తేదీన థియేటర్ లలో విడుదలైంది. దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) ప్రధాన పాత్రలో మెరువగా.. స్నేహం నేపథ్యంలో ఉన్న సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇంకా థియేటర్ (Theatres)లలో కొనసాగుతున్న ఈ సినిమాను చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. అయితే చిత్రాన్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఏప్రిల్ 27 నుంచే స్ట్రీమింగ్ (Streaming) మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
కాగా ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్ లలోనే చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు (Viewers) పేర్కొంటున్నారు. ముఖ్యంగా వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్, ధరణి పాత్రలో నానిలను చూడాలంటే పెద్ద తెర (Theatre) కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక ఘట్టమైన క్లైమాక్స్ కు మాత్రం 75 ఎంఎం కూడా సరిపోదని చెబుతున్నారు. దసరా సినిమా ఓటీటీలో కూడా రికార్డులు (New Records) బద్దలు కొడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.