Teenage Boy Opens Fire In Serbian Capital, Kills 8 Children, One Guard
Teenage Boy Opens Fire:సెర్బియాలో (Serbia) ఓ టీనెజర్ రెచ్చిపోయాడు.సెంట్రల్ బెల్గ్రేడ్లో గల వ్లాడిస్లవ్ రిబ్నికర్ ప్రైమరీ స్కూల్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 8 మంది (8 people) చిన్నారులు, ఓ గార్డ్ (guard) అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు చిన్నారులు (children), ఓ టీచర్ (teacher) గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కాల్పులు జరిపిన బాలుడిని కేకే అని గుర్తించారు. తన తండ్రి తుపాకీ (father gun) తీసుకొని కాల్పులు జరిపాడని పోలీసులు (police) తెలిపారు. అతను వయస్సు 14 ఏళ్లు అని.. 2009లో జన్మించాడని పేర్కొన్నారు. స్కూల్ యార్డ్ (school yard) వద్ద అతనిని అరెస్ట్ చేశామని తెలిపారు.
స్కూల్ వద్ద కాల్పులు జరుగుతున్నాయని తమకు ఉదయం 8.40 గంటలకు సమాచారం వచ్చిందని పోలీసులు (police) పేర్కొన్నారు. సెర్బియా స్కూళ్లలో కాల్పులు జరగడం చాలా అరుదు. గత కొన్నేళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదు. 2013లో సెంట్రల్ సెర్బియ గ్రామంలో జరిపిన కాల్పుల్లో 13 మంది (13 people) చనిపోయారు.
1990 యుద్దం తర్వాత దేశంలో మిగిలిన ఆయుధాల గురించి మేధావులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నో యూజ్.. తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలా టీనేజర్ల (Teenager) చేతి నుంచి తుపాకీ పేలడం.. అమాయకులు చనిపోవడం జరుగుతుంది.