Suspected ‘spy’ pigeon with fitted devices on leg caught in Odisha
‘spy’ pigeon at odisha:ఒడిశాలో (odisha) స్పై పావురం (spy pigeon) కలకలం రేపింది. జగత్సింగ్పూర్ జిల్లా పారదీప్ (paradip) తీరంలో అదీ కనిపించింది. పావురం కాళ్లకు కెమెరా (camera), మైక్రోచిప్‌ను (microchip) మత్య్సకారులు (fisherman) గుర్తించారు. సముద్రంలో చేపలు (fishes) పడుతుండగా బోటులో పావురం ఉండటాన్ని చూసి.. పారదీప్ మెరైన్ (marine police) పోలీసు స్టేషన్లో అప్పగించారు. నిఘా కోసం పావురాన్ని ఎవరైనా పంపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ పావురం రెక్కపై (wind) ఏదో రాసి కనిపించింది. అదీ ఏ భాషనో తెలియడం లేదు. దీంతో ఆ పావురాన్ని నిఘా కోసం వాడారని పోలీసులు అనుమానిస్తున్నారు. పావురం (pigeon), కెమెరా (camera), మెక్రోచిప్‌తో (microchip) కలిపి సైబర్ నిపుణులకు అందజేస్తామని పారదీప్ ఎఎస్పీ చరణ్ సేతి తెలిపారు. దీంతో నిజం ఏంటో తెలియనుందని అని పేర్కొన్నారు. ‘సైబర్ నిపుణులతోపాటు ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సాయం కూడా తీసుకుంటాం. పావురం రెక్కపై ఏమి రాసిందో నిపుణుల ద్వారా తెలుసుకునే పనిలో ఉన్నాం’ అని జగత్ సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్ మీడియాకు తెలిపారు.
10 రోజుల క్రితం కోణార్క్ తీరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో లంగర్ వేసినప్పుడు పడవలో పావురం (pigeon) కనిపించిందని మత్య్సకారుడు తెలిపారు. అప్పుడు పక్షికి కెమెరా (camera), మైక్రొచిప్ (microchip) గమనించామని చెప్పారు. రెక్కలపై (wind) ఏదో రాసి ఉందని చెప్పారు. ఆ వెంటనె మెరైన్ పోలీసులకు సమాచారం చెరవేశామని పేర్కొన్నారు. ఇటీవల అమెరికాపై చైనా స్పై బెలూన్.. చైనాపై అగ్రరాజ్యం బెలూన్ల అంశం కలకలం రేపింది. డ్రాగన్ బెలూన్ను అమెరికా కూల్చివేయగా.. ఇరుదేశాల మధ్య దుమారం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒడిశా తీరంలో ఓ పావురం కనిపించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
Odisha | A suspected spy pigeon fitted with a tiny camera & a chip caught from a fishing boat off the Paradip coast in Jagatsinghpur
The fishermen found the pigeon in their boat while fishing in the sea. They handed over the pigeon to Paradip Marine police station: Paradip ASP pic.twitter.com/4ABSbDtbsy