ఏపీ(AP)లో వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharath Express)పై రాళ్ల దాడి జరిగింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా ప్రయాణించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తూ వస్తోంది. అయితే పలు ప్రాంతాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి(Tirupathi)కి వెళ్తున్న వందేభారత్ రైలుపై ఏపీలో రాళ్ల దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి గురువారం వెళ్లిన వందేభారత్ ట్రైన్ (Vande Bharath Train)పై రాళ్ల దాడి జరిగింది. గూడురు సమీపంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లు విసినట్లు తెలిసింది. ఈ ఘటనలో రైలు బోగీ అద్దం పగిలింది. దీంతో రేణిగుంట రైల్వేస్టేషన్ లో రైలు కాసేపు ఆగింది. రైల్వే పోలీస్ స్టేషన్ ఈ ఘటనపై ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోాదు చేసుకున్న రైల్వే పోలీసులు(Railway Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వందే భారత్ రైలు(Vande Bharath Train) కూడా పలుమార్లు రాళ్ల దాడికి గురైంది. పోలీసులు ఈ కేసులను సీరియస్ గా తీసుకుని నిందితులకు శిక్ష వేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రైలు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.