Vizag kidney racket issue, tirumala hospital has seized
Vizag kidney racket:విశాఖ (vizag) సాగర తీరంలో కిడ్నీ రాకెట్ అంశం పెను దుమారం రేపింది. బాధితుడు వినయ్ కుమార్ (vinay kumar) నోరు విప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికార యంత్రాంగం పరుగులు తీసింది. సదరు ఆస్పత్రి గురించి ఆరా తీసింది. విశాఖ జిల్లా కలెక్టర్ (collector) ఆదేశాల మేరకు పెందుర్తి పరిధిలో గల తిరుమల ఆస్పత్రిని (tirumala hospital) సీజ్ చేశారు. వినయ్‌తోపాటు మరో ఆరుగురికి కిడ్నీ మార్పిడి (kidney change) చికిత్స చేశారని తెలిసింది.
వాంబేకాలనీకి చెందిన వినయ్ కుమార్‌కు (vinay kumar) డబ్బు అవసరం పడింది. తన కిడ్నీ (kidney) ఒకటి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు. కిడ్నీ బ్రోకర్లు ఇలియానా, కామరాజు, శ్రీను కలిసి అతనిని సంప్రదించారు. ఒక కిడ్నీ ఇస్తే రూ.8.50 లక్షలు ఇస్తామని ఆశచూపారు. దీంతో తన చేతికి డబ్బులు వస్తాయి కదా అని వినయ్ అనుకున్నాడు. ఆపరేషన్ చేసిన తర్వాత మాట తప్పారు. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు కాకుండా.. రూ.2 లక్షలు చేతిలో పెట్టారు. మోసపోయానని గ్రహించి బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. వినయ్‌కు (vinay) సంబంధించిన కథనాలు ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు.
తిరుమల ఆస్పత్రిని (tirumala hospital) జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పీ జగదీశ్వరరావు తనిఖీ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిస్ మెంట్ యాక్ట్ 2002/2007 ప్రకారం రిజిస్ట్రేషన్ కాలేదని నిర్ధారించారు. రిజిష్ట్రేషన్ చేసుకోకుండానే ఓపీ సేవలు, ఆర్థొపెడిక్ సర్జరీ చేస్తున్నారని తెలిసింది. 2 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిని (hospital) సీజ్ చేశారు.
కిడ్నీని (kidney) సొంత కుటుంబ సభ్యులే ఇవ్వాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్ సరిపోతే.. నిబంధనల మేరకు సర్జరీ చేస్తుంటారు. కొందరు డబ్బుల ఆశ చూపి.. పేదల నుంచి కిడ్నీలు తీసుకుంటున్నారు. చివరికీ చెప్పిన విధంగా డబ్బులను ఇవ్వడం లేదు. దీంతో బాధితులు బయటకు వస్తున్నారు. వినయ్‌కు కూడా అలానే మీడియా ముందుకు వచ్చాడు. అతనికి రూ.8.50 లక్షల మొత్తం ఇస్తే.. ఆయన కూడా నోరు తెరిచేవాడు కాదెమో. సో.. అక్రమ అవయవ మార్పిడిపై ప్రభుత్వం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.