ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న తెలంగాణలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. అందుకోసం పలు విభాగాల్లో ఫొటోలను పంపి బహుమతులు గెల్చుకోవాలని ప్రకటించారు.
photography: అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్(Photojournalist Association), తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ(Telangana Language and Culture Department) సారథ్యంలో రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల(Photography contests)ను నిర్వహించనున్నారు. ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ బుధవారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కాంపిటీషన్ లో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన బెస్ట్ న్యూస్ పిక్చర్, పదేండ్లలో వివిధ రంగాల్లో రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించే చిత్రాలు, ప్రాచీన కట్టడాలు(Ancient buildings), పర్యాటక ప్రాంతాలు(Tourist areas), పల్లె అందాలు(Village beauties), జాతరలు, పండుగలు(Festivals), కళారూపాల క్యాటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పోటీలలో పాల్గొనేవారు ఆగస్టు 5వ తేదీలోగా ఎంట్రీలను పంపించాలని పేర్కొన్నారు. ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి ఆగస్టు 16 నుంచి 19 వరకు రవీంద్రభారతిలో ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని, చివరి రోజు గెలుపొందిన వారికి అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. మొదటి బహుమతికి రూ.10 వేలు, ద్వితీయ రూ.5 వేలు, తృతీయ రూ.3 వేల నగదు అందజేయనున్నట్టు వివరించారు.