చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్(Tollywood)లోకి పరిచయమైన కావ్య కల్యాణ్ రామ్. ‘గంగోత్రి’ మూవీలో వల్లంగి పిట్టగా నటించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవిరాముడు (Adaviramudu) తదితర చిత్రాలతో పేరు సంపాదించింది. పెరిగిన పెద్దయిన తర్వాత ‘మసూద’లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ‘బలగం’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.బాడీ షేమింగ్ (Body shaming) విషయంలో కొంతమంది డైరెక్టర్స్ (Directors) ప్రవర్తన తనని చాలా బాధపెట్టిందని కావ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా రీసెంటుగా ఒక పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది. అందుకు ఆమె స్పందిస్తూ .. తన విషయంలో ఏ డైరెక్టరూ ఎప్పుడూ అలా మాట్లాడలేదనీ, అసలు ఆ విషయాన్ని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని కావ్య (Kavya) చెప్పుకొచ్చింది. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఈమె నటించిన ‘ఉస్తాద్(Ustad)’ రిలీజ్కు రెడీగా ఉంది.