Himanshu: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు (Himanshu) ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అదరగొట్టాడు. హైదరాబాద్ శివారు గౌలిదొడ్డి, కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను రూ.కోటి నిధులతో నిర్మించిన సంగతి తెలిసిందే. తన బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఆ స్కూల్ భవనం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు.
‘ఇదే తన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అని.. భయంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ తన కుటుంబం ముందు మాట్లాడుతున్నట్టు ఉందని అదరగొట్టేశాడు. ఏడాది నుంచి ఈ స్కూల్ ఎలా ఉందనే విషయం పరిశీలించానని వివరించారు. స్కూల్ పరిస్థితి చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. అమ్మాయిల వాష్ రూమ్స్ ఉన్న చోట పందులు ఉండటం చూశానని.. అప్పుడు వారి బాధ తనకు అర్థం అయ్యిందని’ హిమాన్షు అన్నారు.
స్కూల్ దత్తత తీసుకోవడానికి ఓ కారణం ఉందన్నారు. తాత తనకు ఇన్స్పిరేషన్ అని.. చెప్పిన మాటలు గుర్తున్నాయని తెలిపారు. చదువుకున్న సమాజం వద్ద పేదరికాన్ని అరికట్టే ఉపాయం ఉందన్నారు. అందుకే స్కూల్‌కి సాయం చేశానని.. కేసీఆర్ మనవడిని కదా.. ఏదైనా నార్మల్‌గా చేసే అలవాటు తనకు లేదన్నారు.
తన స్కూల్ ప్రోగ్రామ్‌లో భాగంగా సీఏఎస్ ప్రెసిడెంట్‌గా స్కూల్ గోడ కట్టించాలని అన్నారు. రెండు పెద్ద ఈవెంట్స్ చేసి రూ.40 లక్షలు కలెక్ట్ చేశామని.. తర్వాత సీఎస్ఐఆర్ ఫండ్ కింద సాయం చేశారని పేర్కొన్నారు. నాన్న కేటీఆర్ కూడా చదువు తగ్గినా ఫర్లేదు కానీ.. వంద మందికి సాయం చేసే అవకాశం ఉంటే చేయాలని చెప్పారని తెలిపారు. కుటుంబం, స్నేహితుల సహకారంతో ఇది సాధ్యమైందని హిమాన్షు అన్నారు.