himanshu golden hour cover song:యూట్యూబ్‌లో షేర్ చేసిన హిమాన్ష్.. గర్వంగా ఉంది:కేటీఆర్
himanshu golden hour cover song:మంత్రి కేటీఆర్ (ktr) తనయుడు హిమాన్షు (himanshu) తన ప్రతిభను చాటుతున్నారు. ఓ పాప్ గీతానికి (pop song) కవర్ సాంగ్ (cover song) చేశారు. అమెరికన్ సింగ్ జేవీకేఈ రూపొందించిన గోల్డెన్ అవర్ సాంగ్‌కు కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశారు. ఇదే తన తొలి కవర్ సాంగ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కవర్ సాంగ్‌పై మంత్రి కేటీఆర్ (ktr) సంతోషం వ్యక్తం చేశారు.
HimanshU Rao Praises His Grandfather Rule In Telangana
himanshu golden hour cover song:మంత్రి కేటీఆర్ (ktr) తనయుడు హిమాన్షు (himanshu) తన ప్రతిభను చాటుతున్నారు. ఓ పాప్ గీతానికి (pop song) కవర్ సాంగ్ (cover song) చేశారు. అమెరికన్ సింగ్ జేవీకేఈ రూపొందించిన గోల్డెన్ అవర్ సాంగ్‌కు కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశారు. ఇదే తన తొలి కవర్ సాంగ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కవర్ సాంగ్‌పై మంత్రి కేటీఆర్ (ktr) సంతోషం వ్యక్తం చేశారు. బిడ్డ ఘనత పట్ల ఉద్విగ్నతకు లోనయ్యానని, ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. వీడియోను ఎంతగానో ఆస్వాదించానని పేర్కొన్నారు.
అమెరికాకు (america) చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన ‘గోల్డెన్ అవర్’ (golden hour) సాంగ్‌ను (song) హిమాన్షు (himanshu) అద్భుతంగా ఆలపించారు. ఇంగ్లీష్ సాంగ్ అలాపనలో హిమాన్ష్ ఆంగ్ల యాస పలికిన తీరు అద్భుతంగా ఉంది. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడారు. పాటకు సంబంధించిన వీడియోను హిమాన్ష్ ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్లో షేర్ చేశారు. ఈ సాంగ్‌పై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.
హిమాన్షు తండ్రి, మంత్రి కేటీఆర్ (ktr) కూడా పాటకు ఫిదా అయ్యారు. ‘సూపర్ ప్రౌడ్ అండ్ ఎగ్జైటెడ్ ఫర్ మై సన్’ అంటూ మంత్రి తన రీట్వీట్ చేశారు. తనకు నచ్చిందని.. మీకు కూడా నచ్చుతుందని రాశారు. కేటీఆర్ రీట్వీట్‌కు హిమాన్ష్ (himanshu) థ్యాంక్యూ డాడీ అని రిప్లై ఇచ్చారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో పోస్టు చేసిన రెండు గంటల్లో 5,500 మందికిపైగా చూశారు.