»Singer Mangli Is Seriously Injured Hyderabad Bonalu 2023
Mangli: సింగర్ మంగ్లీకి తీవ్ర గాయాలు!
సింగర్ మంగ్లీ అంటే తెలియని వారుండరు. ఆమె గొంతుకు కోట్లమంది అభిమానులున్నారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ(Mangli) అలియాస్ సత్యవతి.. ఆ తరువాత పాపులర్ సింగర్‌గా ఫేమస్ అయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మేకర్స్ తమ సినిమాల్లో మంగ్లీ పాట ఒక్కటైనా ఉండాలి.. అనే స్థాయికి ఎదిగింది. అయితే తాజాగా మంగ్లీ గాయాల పాలయ్యరు.
ఫోక్ సాంగ్సే కాదు.. సినిమాల్లో వచ్చే స్పెషల్ సాంగ్(special song)కు మంగ్లీ చాలా ఫేమస్. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట అద్భుతం అనేలా ఉంటాయి. పల్లె పాటలు, సినిమా పాటలతో యువతను ఉర్రుతులూగిస్తోంది మంగ్లీ. ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి సినిమాలోను మంగ్లీ సాంగ్ ఉండాల్సిందే. ఆయా సినిమాల్లో ఆమె పాడిన పాటలే(songs) హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక ఫెస్టివల్ సీజన్లో బోనాలు, బతుకమ్మ సాంగ్స్‌తో దుమ్ములేపుతోంది మంగ్లీ. అలాంటి మంగ్లీకి కాలికి తీవ్ర గాయం అయింది.
ప్రతీ సారి బోనాలు సాంగ్‌తో అలరించే మంగ్లీ(Mangli).. ఈసారి కూడా తెలంగాణ జరగనున్న బోనాల కోసం ఓ సాంగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ సాంగ్ షూటింగ్లో మంగ్లీ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయం అయింది. వెంటనే అక్కడున్నవారు మంగ్లీని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం మంగ్లీకి పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మంగ్లీని డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. కానీ కొన్ని రోజుల పాటు మంగ్లీని విశ్రాంతి తీసుకోవాలని సూచించారట డాక్టర్లు. దీంతో కాస్త ఆందోళనకు గురైన మంగ్లీ అభిమానులు(fans).. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయింది. ప్రస్తుతం ఆల్బమ్స్‌తో పాటు సినిమాల్లోను రాణిస్తోంది.