సమంత ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనమే.. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది అమ్మడు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఏదైనా పోస్ట్ చేస్తే నానార్థాలు తీసే నెటిజన్స్.. ఇప్పుడు సామ్ అందుకే సైలెంట్ అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో బడా ప్రాజెక్ట్స్ చేస్తోంది సమంత. అలాగే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉన్నట్టు టాక్. ఇలా సినీ కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమంత.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం.. అంతుబట్టని విషయమే. చైతూతో డివోర్స్ తీసుకున్న తర్వాత తనదైన స్టైల్లో నెటిజన్స్‌కు కౌంటర్ ఇచ్చిన సామ్.. ఇప్పుడెందుకు సైలెంట్ అయింది.. ఇదే ఇప్పుడు అందరి డౌట్. ఈ క్రమంలో రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులతో చేస్తున్న సినిమాలో యాక్షన్ కోసం.. సామ్ ట్రైనింగ్ తీసుకుంటుందని వార్తలొస్తున్నాయి.
అయితే గత రెండు మూడు రోజులుగా ఓ కొత్త పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ మధ్య సమంత పై ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని.. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే సామ్.. సోషల్ మీడియాకు దూరంగా ఉందని టాక్. ఇక్కడ మరో గాసిప్ ఏంటంటే.. సమంత అమ్మతనానికి దూరంగా ఉండడానికి షాకింగ్ డెషిషన్ తీసుకుందని కూడా భోగట్టా. అయితే ఇలాంటి వార్తల్లో అసలు నిజముందా.. అనేది అర్థం కాని విషయమే. సామ్ సైలెంట్ అయిపోయినా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా అమ్మడు ఇలాంటి వార్తలపై స్పందించి.. క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి సామ్ దీనిపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.