భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో విడుదలైన శాకుంతలం(shaakuntalam) చిత్రం తొలిరోజు కలెక్షన్లలో పర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు(Day 1 Collection) దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి ఇక్కడ చూడండి.
సమంత(Samantha) ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం(Shaakuntalam)’ నిన్న(ఏప్రిల్ 14న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై సమంత భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఈ సినిమా చూసిన వాళ్లు.. శాకుంతల మూవీ బాలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. మరోవైపు ఈ చిత్రాన్ని త్రీడిలో కూడా రిలీజ్ చేశారు. తీరా ఈ సినిమా థియేటర్లోకి వచ్చాక నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలే కాదు పబ్లిక్ టాక్ కూడా దారుణంగా ఉంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా..గుణ టీమ్‌వర్క్స్‌పై నీలిమ గుణ నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు పంపిణీ చేశారు.
దీంతో ఈ చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి కేవలం 5 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసినట్లు తెలిసింది. మరోవైపు USలో ఈ చిత్రం ఒక్క రోజులోనే 150k డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.2.66 కోట్లు గ్రాస్ రాగా, తమిళంలో రూ.0.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటకలో కలిసి రూ.0.4 కోట్లు, ఓవర్సీస్లో రూ.1.5 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2023 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదలైన చిత్రాల్లో టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్లలో ఏడవ స్థానంలో నిలిచింది. వీరసింహారెడ్డి చిత్రం తొలిరోజు రూ.50.1 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండగా, వాల్తేర్ వీరయ్య రూ.49.1 కోట్లు గ్రాస్ తో రెండో స్థానంలో ఉంది.
ఈ చిత్రంలో హీరోగా దేవ్ మోహన్(Dev Mohan) యాక్ట్ చేయగా మిగతా క్యారెక్టర్లలో సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, కబీర్ బేడీ, జిషు సేన్‌గుప్తా, కబీర్ దుహన్ సింగ్, హరీష్ ఉత్తమన్, సుబ్బరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, జిషు సేన్‌గుప్తా, మధు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, అల్లు అర్హ సహా తదితరులు నటించారు.