»Rs 63 56 Thousand Crore In Ap Not Used Cag Report Said
Cag Report: ఏపీలో రూ.6,356 వేల కోట్లు నాశనం..ఉపయోగించుకోలే!
ఏపీ రాష్ట్రానికి(AP Government) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ ఉపయోగించుకోకుండా అలాగే ఉందని కాగ్(CAG) తెలిపింది. గత ఏడాదితో పోల్చితే రుణాలు కూడా పెంచామని.. కానీ ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక గుర్తు చేసింది
ఏపీ రాష్ట్రానికి(AP Government) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ ఉపయోగించుకోకుండా అలాగే ఉందని కాగ్(CAG) తెలిపింది. గత ఏడాదితో పోల్చితే రుణాలు కూడా పెంచామని.. కానీ ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక గుర్తు చేసింది. మరోవైపు ఇప్పటికే రూ.24, 257 కోట్ల నిధులు..పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా ఇచ్చినట్లు వెల్లడించారు.
2022 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మేరకు కాగ్ నివేదికను సమర్పించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు, రెవిన్యూ సహా ఇతర అంశాలతోపాటు ఆడిట్ రిపోర్టును కూడా జత పరిచింది.
ఇంకోవైపు బడ్జెట్లో చూపని అదనపు రుణాలు రూ.1,18,394 కోట్లు ఉన్నట్లు కాగ్ నివేదిక తెలిపింది. మరోవైపు డిస్కంలు, నీటి పారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.17,804 కోట్లు ఉన్నాయని పేర్కొంది. వీటిని బడ్జెట్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 2021-22లో ఏపీ 18.47 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటుని నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇంకోవైపు రూ.688 కోట్ల రెవిన్యూ ఖర్చును తప్పుగా చూపించాలని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 90 శాతం రుణాలు 13.99 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నట్లు తెలిపింది.