»Rs 2000 Crore Liquor Scam In Chhattisgarh Ed Inquiry
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణం..ఈడీ ఎంక్వైరీ
ఢిల్లీలో లిక్కర్ స్కాం ఘటన మరువక ముందే తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో లిక్కర్ కుంభకోణం(liquor scam) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఢిల్లీలో స్కాం కంటే ఇది పెద్దదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ దందాలో ప్రధాన నిందితుడు ధేబర్ సహా పలువు అగ్ర రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లు ఈడీ చెబుతోంది.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మద్యం కుంభకోణానికి(liquor scam) సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఈడీ(enforcement directorate) తెలిపింది. ఈ క్రమంలో స్కాం విలువ రూ. 2,000 కోట్లకుపైగా ఉందని పేర్కొంది. అంతేకాదు దేశ రాజధానిలో దర్యాప్తు చేస్తున్న దానికంటే ఇది పెద్ద మనీలాండరింగ్ రాకెట్ అని ఈడీ ఏజెన్సీ చెప్పింది. ఈ కుంభకోణంలో అగ్ర రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల ప్రమేయం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాయ్ పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ED మే6న అరెస్టు చేసింది. ఈ క్రమంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు.
ఈ స్కాం 2019 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిందని ఈడీ(ED) తెలిపింది. అంతేకాదు ఈ దాందాలో ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా కూడా ఉన్నారని వెల్లడించింది. ధేబర్ పరారీలో ఉండగా శనివారం తెల్లవారుజామున ఒక హోటల్ వెనుక నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పట్టుబడ్డాడని తెలిపింది. మద్యం స్కాంలో అతనే కింగ్‌పిన్ అని ED పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ధేబర్‌ను ఈడీకి నాలుగు రోజుల కస్టడీని మంజూరు చేసింది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బైపాస్ చేయబడిన డిస్టిలరీల నుంచి అక్రమంగా సరఫరా చేయబడిన మద్యం, అక్రమ సిండికేట్‌కు హోలోగ్రామ్‌లు జారీ చేయబడిందని ED పేర్కొంది. ఈ రాకెట్‌ను ధేబర్ నడుపుతున్నాడని చెప్పింది. ఆ క్రమంలో అతనికి మద్దతుగా ఉన్నత స్థాయి రాజకీయ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్లు చట్టవిరుద్ధంగా సపోర్ట్ చేసినట్లు వెల్లడించింది.
డిస్టిల్లర్లు, లైసెన్స్ హోల్డర్లు, ఎక్సైజ్ అధికారులు, బాటిల్ తయారీదారులు, హోలోగ్రామ్ ప్రింటర్లు, విక్రేతల నుంచి మొదలుకొని మద్యం వ్యాపారం మొత్తం వ్యవహారాన్ని ధేబర్ నియంత్రిస్తున్నారని ED తెలిపింది. ఈ విధంగా వారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు జమ చేయకుండా మొత్తం అమ్మకపు ఆదాయాన్ని జేబులో వేసుకున్నారని ఆరోపించింది.