Revanth Reddy: మాట మార్చిన రేవంత్ రెడ్డి! నేను అలా అనలేదు…
పార్టీ సీనియర్లపై (senior congress leaders) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Telangana Congress President Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్టీ సీనియర్లపై (senior congress leaders) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Telangana Congress President Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాల్కొండ నియోజవకర్గంలో (Balkonda constituency) జరిగిన పాదయాత్ర (padayatra) సందర్భంగా తాను సీనియర్ల పైన (senior party leaders) ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సీనియర్ లు అమ్ముడుపోయిన వస్తువులు అని తాను ఎప్పుడూ అనలేదని, తాను చేసిన వ్యాక్యలను మరో రకంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేను సీనియర్ నేతల పైన చేసిన వ్యాఖ్యల మీద ఒక న్యూస్ పేపర్ తప్పుడుగా రాసింది. వారు అమ్ముడు పోయారని నేను చెప్పినట్లు రాసింది. తాను ఎప్పుడూ అనని మాటలను ఇలా రాయడం సరికాదు. మీడియా ఇలాంటి వాటి పట్ల సంయమనం పాటించాలి. ఇలాంటి తప్పుడు వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుదోవ పట్టించే, అవాస్తవ కథనాలు సరికాదు. రాజకీయ వివాదాలను రెచ్చగొట్టడం ద్వారా సమస్యలను మరింత క్లిష్టతరం చేయకూడదు అని కోరుకుంటున్నాను’ అని రేవంత్ అన్నారు.
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని రేవంత్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడి నుండి ఈ వ్యాఖ్యలు సరికాదని, ఆయన అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వినిపించాయి. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ ప్రకటన ఆఫ్ ది రికార్డ్ కాబట్టి ఆయన చాలా తెలివిగా మాట్లాడారని సొంత పార్టీకి చెందిన ఓ నేత అభిప్రాయపడ్డారు.