»President Droupadi Murmu Arrival In Hyderabad July 4th 2023 Traffic Restrictions These Areas
Droupadi murmu: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక.. ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) మంగళవారం హైదరాబాద్‌లో(hyderabad) ఒకరోజు పర్యటన చేయనున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) జూలై 4, 2023న హైదరాబాద్(hyderabad) నగరానికి వస్తున్నందున ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లే ముందు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. హకీంపేట్ వై జంక్షన్ సమీపంలోని హనుమాన్ దేవాలయం, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోతుకుంట ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది.
ఆ తర్వాత హెలికాప్టర్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి చేరుకుని అక్కడ ఆంగ్లేయులతో పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు(alluri sitarama raju) 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్రింది ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లించబడుతుంది. బొల్లారం, అల్వాల్, లోతుకుంట, త్రిముల్గే, ఖర్ఖానా, JBS ప్లాజా జంక్షన్, PNT ఫ్లైఓవర్, HPS అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్ గ్రీన్‌ల్యాండ్స్, జంక్షన్ మోనప్ప జంక్షన్, పంజాగుట్ట, NFCL, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెం.45 జంక్షన్ లలో ప్రధానంగా ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పౌరులు ఈ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఏర్పాటు చేసుకోవాలని, అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.