ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఎవరు గుండెపోటు(Heart Attack) బారిన పడుతున్నారో ఊహించలేని పరిస్థితి. చిన్న పిల్లలు, యుక్త వయస్కులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా….. తాజాగా ఓ నిండు గర్భిణీ(Pregnent) ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్, కల్పన భార్యభర్తలు.. హేమంత్ ప్రైవేట్ ఉద్యోగి కాగా.. ఆయన భార్య కల్పన (28) ఆరు నెలల గర్భవతి. ఇంట్లోనే ఉంటుంది. అయితే, ఏడవనెల దగ్గరపడుతుండటంతో సీమంతం నిమిత్తం ఆమెను సంజీవయ్యనగర్ లోని పుట్టింటికి 15 రోజుల క్రితం పంపించారు. ఈ క్రమంలో కల్పన గురువారం ఉదయం బాత్రూమ్లో జారి కిందపడింది. గమనించిన కుటుంబసభ్యులు.. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఫిట్స్, గుండెపోటు(Heart Attack) రావడంతో కల్పన మృతి చెందినట్లు వైద్యులు, పోలీసులు తెలిపారు. కల్పనతో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోడంతో హేమంత్ తో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.