ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రకెక్కింది. తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అటువంటి విశిష్టత కలిసి దేవాలయంలో మద్యం, మాంసం (Meat) వంటివి నిషేధం. అయినా కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రకెక్కింది. తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అటువంటి విశిష్టత కలిసి దేవాలయంలో మద్యం, మాంసం (Meat) వంటివి నిషేధం. అయినా కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు. రూల్స్ పాటించకుండా కొందరు షికారీలు మాంసం (Meat) వండి తింటున్నారు. ఇలా కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే విజిలెన్స్ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్లి చూసేసరికి ఇద్దరు షికారీలు అధికారుల కంటపడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు షికారీలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఆ షికారీలకు మాంసం (Meat) ఎక్కడి నుంచి వచ్చిందోననే వివరాలు సేకరిస్తున్నారు. వారికి మాంసం (Meat) ఎవరు ఇచ్చారనే కోణంలో విచారణ సాగుతోంది. తిరుమల(Tirumala) కొండపైకి వెళ్లడానికి ముందే అందర్నీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశాక కొండపైకి అనుమతిస్తారు. ఇంత గట్టి భద్రత ఉన్నా కూడా షికారీల దగ్గర మాంసాన్ని (Meat) ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు పోలీసు అధికారులకు తలెత్తుతున్నాయి. అయితే అధికారులకు పట్టుబడిన వ్యక్తి మాత్రం తాను తప్పు చేయలేదని చెబుతున్నాడు. ఒక మహిళను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దర్నీ విచారణ కోసం పోలిస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
గత కొన్ని రోజులకు ముందు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తిరుమల(Tirumala)లో అపచారం జరిగిందని, భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన మర్చిపోక ముందే ఇంకోసారి తిరుమల(Tirumala)లో ఇలాంటి అపచారం జరిగింది. దీంతో భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఆలయ మాడవీధుల్లోకి కారు కూడా ఈమధ్యనే దూసుకొచ్చి షికారు చేసిది. ఇన్నోవా కారుపై సీఎంఓ స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూసీచూడనట్లుగా వదిలేశారు. భద్రతా సిబ్బంది అడ్డు చెప్పకపోవడంతో కారును మాఢ వీధుల్లోకి ఆ డ్రైవర్ తీసుకొచ్చాడు.
తిరుమల(Tirumala)లో ఈ రెండు సంఘటనలు మర్చిపోక ముందే ఇప్పుడు మాంసం తింటూ షికారీలు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ముఖ్యంగా చూస్తే భద్రతా విభాగంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా తిరుమల(Tirumala)లో మద్యం, సిగరెట్లతో కొంత మంది పట్టుబడ్డారు. ఈ ఘటనలతో భక్తులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన తిరుమల(Tirumala)లో ఇటువంటి ఘటనలు జరగడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తిరుమల(Tirumala)లో మాంసం (Meat) పట్టుబడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.