పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్… నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డును విడుదల చేసింది. కార్డు వెంట తీసుకు రావాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకుంటే సరిపోతుందని వెల్లడించింది. రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఉంటుందని తెలిపింది. రూపే క్రెడిట్ కార్డు లింక్ చేసుకున్న యూపీఐ ఐడీ ద్వారా ట్రాన్సాక్షన్స్ సజావుగా ఆఫ్ లైన్, ఆన్ లైన్ చెల్లింపులు రెండు వేగవంతమవుతాయని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు చెల్లింపులను మరింత సులభతరం చేసేలా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డు సేవలు ప్రారంభించినట్లు పేమెంట్స్ బ్యాంకు సీఎండీ తెలిపారు. వినియోగదారులకు, వ్యాపారులకు సులభతరం చేసేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఈ సౌకర్యాన్ని తీసుకు వచ్చింది.