ప్రస్తుతం పవర్ స్టార్ pawan kalyan ఉన్నంత స్పీడ్‌లో మరో ఏ హీరో కూడా లేడనే చెప్పాలి. ఒకేసారి నాలుగు సినిమాలను హ్యాండిల్ చేస్తున్నారు. పొలిటికల్ ఎజెండాలా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్pawan kalyan). ప్రస్తుతం ఓజి(OG) షూటింగ్ కూడా ఓవర్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.
ఒక్కో సినిమాను 20 నుంచి 30 రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నారు పవన్(pawan kalyan). ఇప్పటికే వినోదయ సీతమ్ రీమేక్ కోసం.. తన పార్ట్‌కు సబంధించిన షూటింగ్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. వారం, పది రోజుల్లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసిన హరీష్ శంకర్.. ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడు. మే 11న ఉస్తాద్ నుంచి వీడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఉస్తాద్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోగానే.. వెంటనే ముంబై(mumbai)లో వాలిపోయారు పవర్ స్టార్. రీసెంట్‌గానే ‘ఓజి(OG) షూటింగ్‌ను భారీ యాక్షన్‌తో మొదలు పెట్టారు. ఈ సినిమాను సుజీత్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ముంబైలో స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా జాయిన్ అయింది. ఇక అనుకున్నట్టే తాజాగా ముంబై షెడ్యూల్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ని పూణే(pune)లో ప్లాన్ చేస్తున్నారట.
ఈ గ్యాప్‌లో పవన్(pawan kalyan)పొలిటికల్ పనులతో బిజీ కానున్నారట. మే ఫస్ట్ వీక్‌లో పూణె షెడ్యూల్ పూర్తి చేయనున్నారట. అయితే ఉస్తాద్, ఓజిని పరుగులు పెట్టిస్తున్న పవన్ నుంచి.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్ మాత్రం రావడం లేదు. వాస్తవానికి ఉస్తాద్, ఓజితో పాటు వీరమల్లు షూటింగ్‌ను కూడా పవన్ కంప్లీట్ చేయనున్నారని వినిపించింది.
కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అసలు హరిహర వీరమల్లు(hari hara veera mallu) లైన్లో ఉందా? లేదా? అనే డౌట్స్ వస్తున్నాయి. మరి ఓజి తర్వాత పవన్ ఏ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారో చూడాలి.