»Pan India Star Ram Charan Or Ntr For Agent Movie Pre Release Event
Agent: ‘ఏజెంట్’ ఈవెంట్ కోసం పాన్ ఇండియా స్టార్?
ఏజెంట్(Agent) కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ.. ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఏజెంట్(Agent) కోసం ఇప్పటికే అఖిల్ చేసిన స్టంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయవాడలో ట్రైలర్ లాంచ్ పోస్టర్ అనౌన్స్మెంట్.. కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఏజెంట్ పై మరింత బజ్ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఏజెంట్ పై భారీ బజ్ రావాలంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంతకుమించి అనేలా చేయాల్సిందే. ప్రస్తుతం ఏజెంట్ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మాసివ్ గ్రాండ్ ఈవెంట్‌ని ఏప్రిల్ 23న హైదరాబాద్(hyderabad)లో చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ఈవెంట్‌కు ముందుగా చరణ్(ram charan) లేదా ఎన్టీఆర్(NTR) చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ని రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఈ ఈవెంట్‌పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఒకవేళ ప్రభాస్ ఈ ఈవెంట్‌కి వస్తే.. ఏజెంట్‌కు భారీ హైప్ వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే డార్లింగ్ నిజంగానే అఖిల్ కోసం వస్తున్నాడా? లేదో? తెలియాల్సి ఉంది. ఇక మళయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఏజెంట్‌ను.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాతో సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.