»Tragedy In Bollywood Industry Yash Chopras Wife Pamela Chopra Passed Away
Yash Chopras wife: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం..యశ్ చోప్రా భార్య మృతి
ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. యశ్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) ఈరోజు ఉదయం ఏప్రిల్ 20న కన్నుమూశారు. ఆమెకు 74 సంవత్సరాలు. గత 15 రోజులుగా ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తాజాగా మరణించారు. ఆమె సినీ నిర్మాత ఆదిత్య చోప్రా, నటుడు ఉదయ్ చోప్రాలకు తల్లి, రాణి ముఖర్జీకి అత్త. ఆమె మరణం ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది.
పమేలా, యాశ్ చోప్రా 1970లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉదయ్, ఆదిత్య చోప్రా ఉన్నారు. పమేలా గాయనిగా తన ప్రతిభతో ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు యాశ్ చోప్రా అనేక చిత్రాలకు ఆమె చేసిన సహకారాన్ని మరచిపోలేము. ఆమె కభీ కభీ, ముజ్సే దోస్తీ కరోగే వంటి అనేక ప్రసిద్ధ పాటలను పాడింది. అవి నేటికీ అభిమానులకు ఇష్టమైనవిగా ఉన్నాయని చెప్పవచ్చు.
పమేలా గాయనిగానే కాకుండా నిర్మాతగా, సహ రచయితగా కూడా పనిచేసింది. ఆమె స్వతంత్రంగా చిత్రాలను నిర్మించింది. యాశ్ చోప్రా, ఆదిత్య చోప్రా, రచయిత్రి తనూజా చంద్రతో కలిసి దిల్ తో పాగల్ హై స్క్రిప్ట్‌ను సహ రచయితగా చేసింది. దిల్ తో పాగల్ హై చిత్రంలోని ఓపెనింగ్ సాంగ్ ఏక్ దుజే కే వాస్తేలో కూడా పమేలా తెరపై కనిపించింది.
ఇది కూడా చూడండి: Priyanka chopra: శృంగారం చేసేటప్పుడు చేతులు అడ్డుపెట్టుకున్న ప్రియాంక.. మరి సమంత పరిస్థితి!?