• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మచిలీపట్నం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో పశువులను ఢీకొట్టిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గొల్లగాని సత్యనారాయణ (35) స్థానిక మూడు స్థంభాల సెంటర్ సమీపంలో వెండి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా బైపాస్ రోడ్డులో డివైడర్ పక్కన పడుకుని ఉన్న పశువులను ఢీకొట్టాడు.

December 2, 2024 / 07:20 AM IST

చనిపోయిన వారి పేరుతో సైబర్ వల

AP: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ కొత్త మార్గాల్లో మోసం చేయడం సహజమైపోయింది. తాజాగా కడప జిల్లా కేంద్రంలోని అంగడివీధికి చెందిన ఓ వ్యక్తి తల్లి చనిపోయింది. అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ సదరు వ్యక్తి కి ఫోన్ చేసిన కేటుగాడు ‘ మీ అమ్మ పాలసీకి సంబంధించి చివరి కిస్తీ కట్టలేదు. రూ. 5వేలు కడితే రూ. 5లక్షలు వస్తాయి, ఫోన్‌పే చేయండి’అని మాట్లాడాడు. దీంతో పాలసీ తాలూక వివరాలు అడగడంతో ఫ...

December 2, 2024 / 07:14 AM IST

లారీ ఢీకొని యువ రైతు దుర్మరణం

MBNR: మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ రైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 2, 2024 / 05:38 AM IST

చామనపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

KNR: చామనపల్లి క్రాసింగ్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి నుంచి నగునూరు వైపు టీవీఎస్‌పై వస్తున్న వ్యక్తిని నగునూరు నుంచి దుబ్బపల్లి వైపు వెళ్తున్న బైకర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో నగునూరుకి చెందిన లక్ష్మీ నరసింహచారి(65) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ వ్యక్తిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

December 2, 2024 / 05:30 AM IST

15 మంది జూదరులు అరెస్ట్

SKLM: రణస్థలం మండలంలోని చిన్న పిషిణి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 15 మందిని జె.ఆర్.పురం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.33,480 నగదు, 15 సెల్ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. SI ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

December 2, 2024 / 04:36 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కేసు నమోదు

SRCL: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై గణేశ్ తెలిపారు. చేపూరి కైలాసం(60) ఆదివారం ఉదయం 8 గంటలకు తన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కైలాసం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

December 2, 2024 / 04:23 AM IST

10 మద్యం బాటిళ్లు సీజ్

ELR: లింగంపాలెం మండలం కే. గోకవరం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 మద్యం బాటిళ్లను సీజ్ చేశామని సీఐ అశోక్ తెలిపారు. చింతలపూడి సర్కిల్ పరిధిలో నాటు సారా తయారీ, అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 2, 2024 / 04:13 AM IST

బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్టు

W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం గ్రామంలో దాడి చేసి తట్టవర్తి మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఎనిమిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎస్ఐ బి.లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

December 2, 2024 / 04:05 AM IST

కట్టెల ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

KMR: బిచ్కుంద మండలం గోపన్నపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో ఓ రైతు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం శాంతాపూర్ నుండి నీలగిరి కట్టెలను హస్టుల్‌కు చెందిన ఈర్వంత్ అనే రైతు,తన చేనులో గుడిసె వేయడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా గోపనపల్లి శివారులో కట్టెల ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్లో ఉన్నరైతు ఈర్వంత్ కట్టెల కింద పడి మృతి చెందాడు.

December 1, 2024 / 08:39 PM IST

టాటా ఏసీ.. ఆర్టీసీ బస్సు ఢీ

NZB: ఆర్మూర్ పట్టణం సుభాష్ నగర్ వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు కోడిగుడ్ల లోడ్‌తో వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ ఢీ కొన్నాయి. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఆర్మూర్ వద్ద ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. టాటా ఏసీ వ్యాన్ డ్రైవర్ ని ఆంబులెన్స్‌లో నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 1, 2024 / 08:33 PM IST

బల్లికురవలో రోడ్డు ప్రమాదం చిన్నారి మృతి

BPT: బల్లికురవ మండలంలోని వేమవరం వాగు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ భాష తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం గ్రామం వద్ద వీరిది చక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న SK. ఖాన్సా అనే మూడు నెలల పాప అక్కడికక్కడే మరణించింది.

December 1, 2024 / 07:59 PM IST

బావిలో పడి విద్యార్థి మృతి

SRPT: అనంతగిరి మండలం శాంతినగర్లోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈతకు దిగగా ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

December 1, 2024 / 06:08 PM IST

అంబులెన్సు బోల్తా.. నలుగురి మృతి

రోగితో వెళ్తున్న ఓ అంబులెన్స్‌ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి బిహార్‌లోని చంపారన్‌కు రోగిని తరలిస్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్సు ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అనిష్‌ షా(18) అనే రోగిని తమ స్వగ్రామానికి త...

December 1, 2024 / 06:03 PM IST

గుడుంబా స్థావరాలపై దాడులు

JN: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పల మండలం బోడబండ తండాలో ఆదివారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తండాకు భూక్య మల్లేష్ అతని భార్య భూక్య బుజ్జి లు కలిసి గుడుంబా కాస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. దాడుల్లో 4 లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎస్ఐ సృజన్ కుమార్ తెలిపారు.

December 1, 2024 / 05:46 PM IST

మట్టి పెళ్లలు కూలి నలుగురు బాలికలు మృతి

బిహార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లా సారెంజాపూర్ గ్రామంలో మట్టి పెళ్లలు కూలి నలుగురు బాలికలు ప్రాణాలు విడిచారు. ఇంటి కోసం మట్టి తవ్వుతుండగా ఆరుగురు బాలికలపై పెళ్లలు పడ్డాయి. వెంటనే పెళ్లలను తవ్వి బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు శివాని, సంజ్, నైన్‌తారా, సరితగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్...

December 1, 2024 / 05:17 PM IST