సిద్దిపేట: కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో లేగ దూడ హైనా దాడి చేసి చంపేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పరశు రాములు తన వ్యవసాయ పొలం వద్ద కొట్టంలో పశువులను కట్టేశాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి లేగ దూడ చనిపోయి ఉంది. లేగ దూడ చనిపోయిన ప్రాంతంలో రక్తపు చుక్క ఆనవాళ్లు ఏమాత్రం లేవని దీంతో హైనా లాంటిది దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.