KNR: హుజురాబాద్‌లోని మంటోసూరి పాఠశాల ఆవరణలోని పాఠశాల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలో షార్టుసర్క్యూట్ జరిగిందా? లేదా ఇతర కారణాలతో మంటలు చెలరేగాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం కావడంతో పిల్లలకు పెను ప్రమాదం తప్పింది.